డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందించాలని వినతి

RR: షాద్ నగర్ నియోజకవర్గంలో త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందిస్తామని MLA వీర్లపల్లి శంకర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు నిరుపేద మహిళలు ఎమ్మెల్యేను కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని సోమవారం వినతిపత్రం అందించారు. స్పందించిన ఎమ్మెల్యే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో సౌకర్యాలు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని పూర్తి చేసి అందిస్తామన్నారు.