రైతులకు టార్ఫాలిన్లు పంపిణీ

రైతులకు టార్ఫాలిన్లు పంపిణీ

VZM: ఏపి మార్క్ ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగర్రాజు తానా సబ్యుల ఆధ్వర్యంలో బోగాపురం మండలం పోలిపల్లిలో పలువురు రైతులకు ఆదివారం టార్ఫాలిన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రకృతి వ్యవసాయాన్ని రైతులు అలవాటు చేసుకోవాలని, సేంద్రియ సాగుతో ఆరోగ్యకరమైన జీవితం సొంతమవుతుందని సూచించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎరువుల తయారీపై రైతులకు అవగాహన కల్పించారు.