రేపు లక్ష్మీకాసుల హారంతో శ్రీవారి గరుడ సేవ
CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీకళ్యాణ వేంకటరమణ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి గరుడసేవ నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. గరుడ వాహనసేవలో పట్టణంలోని తూర్పు మొగశాల వద్ద గల శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వెండి కాసుల హారం ఆలయం నుంచి సాయంకాలం మూడు గంటలకు శోభాయాత్రగా పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నట్లు తెలిపారు.