గంగాపూర్ జాతరకు పోటెత్తిన భక్తులు

గంగాపూర్ జాతరకు పోటెత్తిన భక్తులు

ASF: రెబ్బెన మండలం గంగాపూర్‌లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతరకు జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. రెబ్బెన రైల్వే గేట్ నుండి ఆలయం వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం భక్తుల తాకిడి మరింత పెరిగిందని పలువురు తెలిపారు.