GOOD NEWS: దివ్యాంగులకు మరో ఛాన్స్
AP: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు 100% రాయితీతో 3 వీలర్ స్కూటర్లను ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఈనెల 25 నుంచి 30వ తేదీకి పొడిగించింది. జిల్లాకు 80 స్కూటర్ల చొప్పున మంజూరు చేయనుంది. 18-45 ఏళ్లు ఉండి, 70% పైగా వైకల్యం, సదరం సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. 10వ తరగతి చదివుండాలి. వివరాలకు https://apdascac.ap.gov.in/ను సంప్రదించాలి.