ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
BDK: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో డిసెంబర్ 29న తెప్పోత్సవం, 30న ముక్కోటి ఏకాదశి కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఈ ఏర్పాట్లను కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సందర్శించారు. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని మిథిలా స్టేడియం ఉత్తర ద్వారంలో క్యూ లైన్‌ల ఏర్పాటు, భక్తుల ప్రవేశ నిష్క్రమణ మార్గాలు వంటి అంశాలను కలెక్టర్ పరిశీలించారు.