ఈనెల 26న మెగా జాబ్ మేళా
ELR: జంగారెడ్డిగూడెం సూర్య డిగ్రీ కాలేజీలో ఈనెల 26న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి ఎన్.జితేంద్ర బాబు తెలిపారు. ఈ జాబ్ ఫెయిర్ నందు 17కి పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, అలాగే సుమారు 1140 లకు పైగా మందికి ఉద్యోగ అవకాశలు కల్పించడం జరుగుతుందన్నారు. 10, ఇంటర్, ఐ.టి.ఐ, డిగ్రీ, పీజీ చదివిన వారు అర్హులన్నారు.