పేదలకు అండగా కాంగ్రెస్
VKB: కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆంజనేయులు అన్నారు. ముజాహిద్ పూర్ గ్రామంలో బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆమన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణయ్య, భీమయ్య, శ్రీను, రమేష్, రాజు పాల్గొన్నారు.