రాజోలులో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన

రాజోలులో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన

E.G: పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం రాజోలు సెంటర్లో నిరసనలు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం లౌకికవాదం వర్ధిల్లాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సీపీఐ నాయకులు దేవరాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. అమిత్‌షాను మంత్రిపదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.