VIDEO: విద్యార్థులను పరామర్శించిన MLA
ASF: కాగజ్ నగర్ పట్టణంలో నిర్మిస్తున్న 100 పడకల ఏరియా ఆసుపత్రి భవన పనులను MLA హరీశ్ బాబు శనివారం పరిశీలించారు. పనులు నాణ్యతతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొనసాగించాలని ఇంజినీర్లకు సూచించారు. అనంతరం ఎల్లూర్ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ గురైన విద్యార్థులను ఆసుపత్రిలో పరామర్శించారు. ఆసుపత్రికి కొత్త ఎక్స్రే యంత్రం మంజూరైందన్నారు.