వింజమూరు విద్యార్థికి ఉత్తమ విద్యార్థి అవార్డ్
NLR: వింజమూరు ZPP పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి గోసాల ఏసురత్న జోసెఫ్ జిల్లా స్థాయిలో ఉత్తమ విద్యార్థి పురస్కారం అందుకున్నాడు. ఈ సందర్భంగా HM మాలకొండయ్య శుక్రవారం విద్యార్థికి అభినందనలు తెలిపారు. ఈనెల 11న భారత తొలి విద్యాశాఖ మంత్రి డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో విద్యార్థి ప్రతిభ చాటాడు.