రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

JGL: రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన బరతాల రాజేందర్ (30) అనే వికలాంగుడు చికిత్స పొందుతూ శుక్రవారంరాత్రి మృతి చెందాడు. రాజేందర్ గ్రామంలోని హనుమన్ ఆలయం వద్ద రోడ్డును దాటుతుండగా జగిత్యాల వైపు నుంచి రాయికల్ వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన రాజేందర్‌ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.