VIDEO: భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్నకలెక్టర్

HNK: భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు. గురువారం నడికూడ మండల కేంద్రంలో, చర్లపల్లి గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల నుండి అర్జీలు స్వీకరిస్తున్న తీరును పరిశీలించారు.