మంచినీటి సమస్యను పరిష్కరించాలని వినతి
W.G: ఆకివీడు నగర పంచాయతీ కృష్ణదేవరాయ నగర్ వాసులు ఎదుర్కొంటున్న తాగునీటి ఎద్దడిపై ఇవాళ కమిషనర్ కృష్ణమోహన్‌కు వినతిపత్రం సమర్పించారు. గత 20 ఏళ్లుగా నీటి సరఫరా సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'అమృత్' పథకం ద్వారా పైపులైన్లు విస్తరించి, తమ ప్రాంతానికి శాశ్వత తాగునీటి వసతి కల్పించాలని వారు కోరారు.