శ్రీకాళహస్తిలో 9 మంది స్మగ్లర్లు అరెస్ట్
TPT: శ్రీకాళహస్తి అటవీ పరిధిలో బుధవారం ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు కూబింగ్ నిర్వహించారు. ఇందులో 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని 9 మంది స్మగర్లను అరెస్ట్ చేసినట్లు ఏఆర్ఎస్సై ఈశ్వర్ రెడ్డి తెలిపారు. కాగా, అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు తిరుపతి జిల్లాకు చెందినట్లు పేర్కొన్నారు. అనంతరం వీరిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.