నగరంలో రేపు, ఎల్లుండి మంచినీటి సరఫరా బంద్

HYD: కృష్ణ వాటర్ ప్రాజెక్టు లైన్ లీకేజీతో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. షేక్‌పేట్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, తట్టిఖానా రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు, గచ్చిబౌలి, మాధాపూర్, కావూరి హిల్స్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాల్లో SEP 1 ఉ.11 నుంచి SEP 2 ఉ.7 వరకు నీటి సరఫరాలో బంద్ ఉండనుందని అధికారులు తెలిపారు.