సెన్సస్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్
GDWL: జనగణన (సెన్సస్) ప్రక్రియ ఎన్నికలతో సమానమైన ప్రాముఖ్యత కలిగిన కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. శనివారం మల్దకల్ మండల కేంద్రంలో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు జరిగే జనగణనలో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.