'జయశంకర్ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాలి'

KMM: తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఇవాల ఖమ్మం తెలంగాణ భవన్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఉద్యమ స్ఫూర్తిని, సిద్ధాంతాలను భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఎంతగానో ఉందన్నారు.