రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురు మృతి

BHPL: జిల్లా కేంద్రంలోని రాంపురం అడవి ప్రాంతంలో సోమవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మహా ముత్తారం మండలం మీనాజీపేటకు చెందిన ఇద్దరు, పంబాపూర్ గ్రామానికి చెందిన ఒకరు ఘటనా స్థలంలో మృతి చెందారు భూపాలపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.