'రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు'
JGL: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మల్లాపూర్ మండలం ముత్యంపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నిర్వాహకులను ఆయన ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు జాప్యం జరగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, తహశీల్దార్ రమేశ్ పాల్గొన్నారు.