రాజ్యాంగ విలువలపై అవగాహన కార్యక్రమం
KNR: సమాజంలో ప్రతి ఒక్కరికీ న్యాయం సమానంగా అందాలనే లక్ష్యంతో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో నగునూర్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు "న్యాయ విజ్ఞాన అవగాహన" సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే. రాణి ఆదేశాల మేరకు సంస్థ సభ్యులు పాల్గొన్నారు.