రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపిక
CTR: పలమనేరు జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాలకు చెందిన మబ్రు హుస్సేన్ అండర్ 14 విభాగంలో రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో విద్యార్థిని సోమవారం పలమనేరు సామాజిక సేవ సంఘం సభ్యులు అభినందించారు. శాలువతో సన్మానించి మెమెంటో, నగదు ప్రోత్సాహక బహుమతి అందజేశారు. క్రీడలు, చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందిస్తామని తెలియజేశారు.