నేడు జిల్లాకు భారీ వర్ష సూచన..!

నేడు జిల్లాకు భారీ వర్ష సూచన..!

SDPT: తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరబాద్ వాతావరణ శాఖ తెలిపింది. సిద్దిపేట జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జిల్లాలో వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. జిల్లా ప్రజలు, చుట్టు ప్రక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.