ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగిస్తాం: మాజీ ఎమ్మెల్యే
BDK: భద్రాద్రి జిల్లాలో రోడ్ల దయనీయ స్థితి, డిఎంఎఫ్ నిధుల దుర్వినియోగంపై నిరసనగా నవంబర్ 7న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ముట్టడించాలని పిలుపునిస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు శనివారం తెలిపారు. సమస్య పరిష్కారం చేపట్టి ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగిస్తామని రేగా స్పష్టం చేశారు.