ముగిసిన 'గుడ్ ఫ్రైడే' ప్రార్థనలు
NLR: ఉదయగిరి మండలం దాసరపల్లి ఇండిపెండెంట్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో శుక్రవారం 'గుడ్ ఫ్రైడే' ప్రార్థనలు నిర్వహించారు. రెవరెండ్ పాస్టర్ జాకబ్ 'గుడ్ ఫ్రైడే' విశిష్టతను వివరించారు. జగతికి శాంతి సందేశాన్ని ఇస్తూ క్రీస్తు శిలువనెక్కిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటామన్నారు. అనంతరం ఆ దేవదేవుడి దైవ సందేశాన్ని భక్తులకు వివరించారు.