రామవరం పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో
ELR: వేలేరుపాడు మండలం రామవరం ప్రాథమికోన్నత పాఠశాలను ఎంఈవో-1 కూరం శ్రీనివాస్ మంగళవారం సందర్శించారు. ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి పరిశీలించారు. ప్రతి తరగతికి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించిన ఆయన సంతృప్తికరంగా ఉందని కితాబు ఇచ్చారు. ఇందులో హెచ్ఎం చిర్రి దేవరాజు ఉన్నారు.