ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ

SKLM: కోటబొమ్మాలి మండల కేంద్రంలోని స్థానిక కొత్తమ్మ తల్లి ఆలయ ఉత్సవాల భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. ఈనెల 23, 24, 25 తేదీలలో నిర్వహించే ఉత్సవాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.