స్కూల్ బస్సు ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంజనాపూరీ వద్ద సిద్దార్థ స్కూల్ బస్సు అదుపుతప్పి ఓ వ్యక్తిని, చెట్టును ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 50 మంది ప్రైమరీ విద్యార్థులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సహాయంతో విద్యార్థులు బయటపడ్డారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది