జగ్గయ్యపేట మున్సిపల్ వార్డు కౌన్సిలర్ రాజీనామా

NTR: జగ్గయ్యపేట మున్సిపల్ 29వ వార్డు కౌన్సిలర్ కంచేటి గీతారాణి తన పదవికి రాజీనామా సోమవారం సమర్పించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు కౌన్సిల్ సమావేశాల్లో, చైర్మన్, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కానందున రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానని పేర్కొన్నారు.