ఇరాన్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్
ఇరాన్ తన సైనిక ఓటమిని అంగీకరించకుంటే ఆ దేశంపై మునుపెన్నడూ లేని విధంగా విరుచుకుపడతామని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. 'ట్రంప్ అబద్ధాలు చెప్పరు, ఆయన నరకం చూపించడానికి సిద్ధంగా ఉన్నారు' అని వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా ప్రతిపాదించిన 15 పాయింట్ల శాంతి ప్రణాళికపై చర్చలు జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు.