ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
AKP: కె.కోటపాడు మండలం చౌడువాడ పీఏసీఎస్‌లో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ ఛైర్మన్ నారాయణమూర్తి, గ్రామ సర్పంచ్ దాడి ఎరుకు నాయుడు ప్రారంభించారు. రైతులు ఖరీఫ్ సీజన్లో పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్నారు. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయన్నారు.