గర్భిణీలకు 4వ నెల నుంచి ఫోన్ కాల్స్

కృష్ణా: మచిలీపట్నంలో గర్భిణీ, బాలింతల ఆరోగ్య రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిల్కారి కార్యక్రమంపై అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ శర్మిష్ఠ మాట్లాడుతూ.. గర్భిణీ 4వ నెల నుంచి బిడ్డకు సంవత్సరం వచ్చే వరకు 911600103660 నెంబర్ ద్వారా వారానికి ఒకసారి ఆరోగ్య సమాచారం అందుతుందని తెలిపారు.