తాడేపల్లిగూడెంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

తాడేపల్లిగూడెంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

WG: తాడేపల్లిగూడెంలోని ఓ హోటల్లో ఇవాళ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి సుందరరామిరెడ్డి తనిఖీలు నిర్వహించారు. వంట గదిలోని ఫ్రీజ్లో మాంసం, కోసిన ఉల్లిపాయ ముక్కల నిల్వలను చూశారు. అపరిశుభ్ర వాతావరణం నెలకొనడమే కాకుండా ప్లాస్టిక్ కవర్లను అధికంగా వినియోగిస్తున్నట్లు ఆయన గుర్తించారు. హోటల్లో తయారైన ఫుడ్ శాంపిల్స్‌ను సేకరించి నాచారం ల్యాబ్‌కు తరలించారు.