ఘనంగా పెద్దమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభం
JGL: ఇబ్రహీంపట్నం గ్రామ శివారులోని దుబ్బమీద పెద్దమ్మ తల్లి ఆలయంలో 5 సంవత్సరాలకు ఓసారి నిర్వహించే జాతర ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ఆలయం నుంచి గ్రామంలోకి శోభాయాత్రగా తీసుకువచ్చారు. ఈనెల 26న పునః ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ సందర్భంగా పోతరాజుల విన్యాసాలు, ప్రత్యేక పూజలు ఆకట్టుకున్నాయి.