'రాజంపేటను జిల్లా చేయాలి'.. విద్యార్థుల నిరసన

'రాజంపేటను జిల్లా చేయాలి'.. విద్యార్థుల నిరసన

'రాయచోటి వద్దు.. కడప ముద్దు’ అంటూ ఒంటిమిట్టలో విద్యార్థులు, మహిళలు ర్యాలీ నిర్వహించారు.  రాజంపేటను జిల్లా చేయాలని, లేదంటే ఒంటిమిట్టను కడప జిల్లాలో కలపాలంటూ ఆందోళన చేపట్టారు. రాయచోటి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తే తమకు జిల్లా కేంద్రం చాలా దూరం అవుతుందని.. కడపలో విలీనం చేసినా, రాజంపేటను జిల్లా చేసినా జిల్లా కేంద్రం సమీపంలోనే ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.