కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న మాజీ మంత్రి
సత్యసాయి: గోరంట్ల మండలం మోటరుపల్లిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పాల్గొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజలను మద్దతు కోరుతూ సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రక్రియను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.