నేడు విద్యాసంస్థలకు సెలవు
MHBD: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు DEO దక్షిణామూర్తి తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు నడుస్తున్నాయని, బుధవారం, గురువారం జరిగే పరీక్షలు వాయిదా వేశారని మిగతా పరీక్షలు యధావిధిగా జరుగుతాయని తెలిపారు.