పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
KNR: గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలని గుండ్లపల్లి సర్పంచ్ వీరమల్ల తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సైదాపూర్ మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో మండల పశువైద్యాధికారి విజేందర్ రావు పాడి పశువులకు గాలి కుంటువ్యాధి నివారణ టీకాలను వేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, పశు వైద్య సిబ్బంది, రైతులు ఉన్నారు.