యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయంలో పలు సేవలు రద్దు

యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయంలో పలు సేవలు రద్దు

BHNG: యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయంలో మార్చి 1 నుంచి 11 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. మార్చి 7న ఎదుర్కోలు మహోత్సవం, 8వ తేదీన తిరు కల్యాణోత్సవం, 9వ తేదీన దివ్యవిమాన రథోత్సవం జరగనున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఆలయంలో జరిగే కల్యాణాలు, హోమాలు, జోడు సేవలు, ఏకాదశి లక్ష పుష్పార్చణ సేవను రద్దు చేసినట్లు తెలిపారు.