చంపుతానని బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు
MNCL: నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన ధాన్యం వ్యాపారి గడ్డం సత్యగౌడ్‌తో గొడవపడి చంపుతానని బెదిరించిన అదే గ్రామానికి చెందిన కాల్వ సతీశ్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసి బస్తాలు తూకం వేసిన తర్వాత సతీశ్ లోడింగ్ అడ్డుకుని వ్యాపారి సత్య గౌడ్‌తో గొడవకు దిగారు. సత్యగౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.