అరుదైన శస్త్ర చికిత్స చేసిన వైద్యులు

అరుదైన శస్త్ర చికిత్స చేసిన వైద్యులు

SKLM: నగరంలోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్సను వైద్యుడు గంగాధరరావు శనివారం చేశారు. ఓ యువకుడు బాణాసంచా స్టీల్ గ్లాస్‌లో పెట్టి పేల్చగా ఆ గ్లాస్ పగిలి పొట్ట భాగాన్ని కోసింది. అనంతరం ఓ క్లినిక్‌లో గాయానికి చికిత్స చేసి కుట్లు వేశారు. కానీ, కడుపునొప్పి తీవ్ర కావడంతో వైద్యులను సంప్రదించగా పేగులో స్టీల్ గ్లాస్ ముక్క ఉన్నట్లు గుర్తించి బయటకు తీశారు.