భక్తిశ్రద్ధలతో ఉమారామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు

భక్తిశ్రద్ధలతో ఉమారామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు

SKLM: రణస్థలం మండలంలోని పాత సుందర పాలెంలో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారికి సోమవారం భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వెంకట రమణమూర్తి ఆధ్వర్యంలో స్వామి వారికి వేకువ జాము నుంచి సుప్రభాత సేవతో పూజాదికాలు మొదలయ్యాయి. అనంతరం రుద్రాభిషేకాలు, సహస్ర నామర్చనలతో పూజాది కార్యక్రమాలు చేపట్టారు.