గద్వాలలో TOSS పరీక్షల షెడ్యూల్ ఖరారు..
గద్వాల జిల్లాలో TOSS ఇంటర్, SSC పరీక్షలు ఈనెల 20 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మి తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. జిల్లా కేంద్రంలో 7 కేంద్రాలు ఏర్పాటు చేయగా 1276 మంది హాజరవుతారు. పరీక్ష కేంద్రాలకు ఒక గంట ముందుగా రావాలని, సెల్‌ఫోన్లు నిషేధమని, సెక్షన్ 144 అమల్లో ఉంటుందని సూచించారు.