ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
SRD: సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు సమాజంలో అందరికి సమానంగా సమన్యాయం కల్పించారన్నారు. ప్రజాప్రతినిధులు ఫాల్గొన్నారు.