'మీ సేవ' కేంద్రాన్ని తనిఖీ చేసిన RI
MNCL: వేమనపల్లి మండల కేంద్రంలోని మీ సేవ కేంద్రాన్ని RI ఖాలిక్ శనివారం తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన సేవల ధరల పట్టికను పరిశీలించి, నిబంధనల మేరకు రుసుములు వసూలు చేస్తున్నారా అని ఆరా తీశారు. ప్రజలకు పారదర్శకంగా, వేగంగా సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.