పరీక్ష ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు
PLD: నేడు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలు రిలీజ్ అయ్యాయి. ఈ ఫలితాల్లో బొల్లాపల్లి మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న షేక్ అమీనా MPC 1000 మార్కులకు 983 మార్కులు, శ్రావణి బాయ్ BiPC 1000 మార్కులకు 972 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు. పరీక్షలకు 77 మంది హాజరు కాగా, 70 మంది ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు.