నిత్య అన్నదానానికి రూ. 60 వేలు విరాళం

NLR: బుచ్చి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయానికి నెల్లూరు వాస్తవ్యులు సుధాకర్ రెడ్డి, స్వప్న నిత్య అన్నదానానికి విరాళం అందజేశారు. ఈ మేరకు ఈవో వెంకట శ్రీనివాసులు రెడ్డికి రూ. 60,000 చెక్‌ను అందజేశారు. దాతలకు శ్రీవార్ల దర్శనం కల్పించి ప్రత్యేక పూజలు జరిపించారు.