తుఫాన్ ఎఫెక్ట్.. సరుకుల కోసం ఎగబడిన జనం
కోనసీమ: మొంథా తుఫాన్ నేపథ్యంలో మంగళవారం జిల్లాలో అధిక ప్రభావం చూపిస్తుందని అధికారులు అప్రమత్తం చేయడంతో నిత్యవసర సరుకుల కోసం దుకాణాల వద్దకు ఎగబడ్డారు. అయినవిల్లి మండలంలో పలు కూరగాయల దుకాణాల వద్ద ప్రజలు ఎగబడ్డారు. ప్రభుత్వం హెచ్చరికలు నేపథ్యంలో రెండు రోజులకు సరిపడా సరుకులు తీసుకెళ్తున్నామని వారు వివరించారు.