CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: కూటమి ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. శనివారం నగరంలోని పార్టీ కార్యాలయం నందు 33 మంది లబ్ధిదారులకు 27 లక్షల 38వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు ద్వారా ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు.