ఘనంగా ప్రారంభమైన కార్తీక మాసోత్సవాలు
KDP: పెండ్లిమర్రి మండలంలోని శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు బుధవారం ఉదయం ఆకాశ దీపోత్సవంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం. క్రిష్ణ నాయక్ మాట్లాడుతూ.. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎలాటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. వృద్దులకు, వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశామన్నారు.